: దీనిని ఇంట్లో పెట్టుకుంటే భూకంపాలు, సునామీల రాక ఇట్టే తెలిసిపోతుంది
భూకంపం, సునామీ హెచ్చరికల కోసం శాస్త్రవేత్తలు సరికొత్త పరికరం తయారు చేశారు. గుండ్రంగా, చిన్నగా, ఫ్లాట్ గా మేకప్ కిట్ లో పౌడర్ డబ్బాలా ఉండే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరికరానికి భూకంప హెచ్చరికలు, పర్యవేక్షణ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేస్తారు. సునామీ రాకడను కొన్ని గంటల ముందే చెప్పేస్తుందీ పరికరం. భూకంపాల రాకను మాత్రం పది లేదా ఐదు నిమిషాల ముందు సూచిస్తుంది. 30 సెకెన్ల సమయం ముందు కూడా భూకంప హెచ్చరికలు జారీ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వల్ప భూకంపం అయితే పసుపు రంగు లైట్ వెలిగి...'స్వల్ప భూకంపం...ప్రాణ నష్టం ఉండదు' అని హెచ్చరిస్తుంది. అలాగే భారీ భూకంపం అయితే ఎరుపు రంగు లైట్ వెలిగి...'భారీ భూకంపం...తక్షణం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోండి' అని వాయిస్ మెసేజ్ ద్వారా హెచ్చరిస్తుంది. దీనిని ఇంట్లో పెట్టుకుంటే భూకంపాలు, సునామీ భయం లేకుండా నిశ్చింతగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.