: సాంకేతిక తప్పిదం కారణంగా అలా జరిగింది: ఎయిరిండియా వివరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా చక్రాలు తెరుచుకోలేదని ఎయిరిండియా వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. జూలై 12న పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం సాంకేతిక లోపం కారణంగా చక్రాలు మూసుకోకుండానే ప్రయాణించింది. సాధారణంగా చక్రాలు మూసుకోకపోతే, విమానాన్ని వెనక్కు మళ్లించి తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తారు. అదీకాక చక్రాలు మూసుకోకుంటే విమానం కేవలం 20000 అడుగుల ఎత్తులోపు మాత్రమే ప్రయాణించాలి. అంతకంటే ఎత్తుకువెళ్తే ప్రమాదం. అయితే అమృత్ సర్ నుంచి ఢిల్లీ మధ్య దూరం తక్కువ కావడంతో పైలట్ విమానాన్ని జాగ్రత్తగా నడిపి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మన్మోహన్ సింగ్ ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది.