: పుష్కరాల ప్రభావంతో తిరుమలకు తగ్గిన భక్తుల తాకిడి
గోదావరి పుష్కరాల ప్రభావంతో తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తూ బోసిపోతున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. కాలినడక భక్తులకు గంట సమయమే పడుతోంది. ఈ నెల 25 వరకు పుష్కర స్నానాలు ఉండటంతో అప్పటివరకు తిరుమలకు స్వల్పంగానే భక్తుల తాకిడి ఉండనుంది.