: భగవద్గీత మతపరమైన గ్రంథం కాదంటున్న హర్యానా విద్యాశాఖ మంత్రి!
శ్రీకృష్ణుడు పాండవ మధ్యముడు అర్జునుడికి బోధించిన తత్వసారం భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని హర్యానా విద్యా శాఖ మంత్రి రామ్ విలాస్ శర్మ స్పష్టం చేశారు. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చడాన్ని వ్యతిరేకించేవాళ్లను ఉద్దేశించి ఆయన పైవిధంగా పేర్కొన్నారు. గీతా ప్రవచనాలను విద్యార్థులకు నైతిక విద్య బోధనాంశంగా చేర్చుతామని అన్నారు. "జూన్ 21న 192 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. అందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. అది జ్ఞానం, అది ఆసక్తి, అది పరిష్కారం... ఇలా చూసుకుంటే 'గీత' జీవిత సర్వస్వం. శ్రీకృష్ణ పరమాత్ముడికి, అర్జునుడికి మధ్య నడిచిన సంభాషణే భగవద్గీత. దాన్ని మేం పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించాం" అని వివరించారు.