: గాలి కలుషితం కావడంతో లండన్ లో రెట్టింపైన మరణాలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ నగరం ఇప్పుడు గాలి కాలుష్యానికి వణికిపోతోంది. గాలి కాలుష్యం కారణంగా లండన్ లోని మరణాల సంఖ్య రెట్టింపయింది. ఏడేళ్ల క్రితం జరిపిన సర్వేలో కాలుష్యం కారణంగా 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని తేలింది. ప్రస్తుతం ప్రతి ఏటా 9,500 మంది కాలుష్య భూతానికి బలవుతున్నారు. వాహనాలు విడుదల చేస్తున్న పొగలో అధికంగా ఉండే నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం 2.5ఎస్ కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని కింగ్ కాలేజీ పరిశోధకులు తేల్చారు.