: బందీలను చంపుతున్న చిన్నారి... ఐఎస్ఐఎస్ మరో వీడియో
తాము బందీలుగా పట్టుకున్న వారిని ఓ చిన్నారితో చంపిస్తున్న వీడియోను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా విడుదల చేశారు. ఇరాక్ లోని ఓ నదీ తీరంలో ఇద్దరు బందీలను ఓ బాలుడి చేతికి తుపాకీ ఇచ్చి వారి తలలకు గురిపెట్టి కాల్పించిన ఉగ్రవాదులు అనంతరం ఆ మృతదేహాలను నదిలోకి తోసేశారు. మొత్తం 22 నిమిషాల పాటున్న ఈ వీడియోలో ఇరాక్ మిలటరీకి చెందిన పలువురిని హత్య చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, గడచిన ఏడాది వ్యవధిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సుమారు 1700 మందిని పొట్టన బెట్టుకున్నారు.