: జింబాబ్వే సిరీస్ తో స్థానం నిలుపుకున్న టీమిండియా
బంగ్లా సిరీస్ టీమిండియా వన్డే ర్యాంకింగ్ ను దిగజారిస్తే, జింబాబ్వే టూర్ మాత్రం మెరుగుపరచింది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ టూ స్థానం నిలబెట్టుకుంది. 129 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 115 పాయింట్లతో టీమిండియా ద్వితీయ స్థానం నిలబెట్టుకుంది. కాగా, భారత్, దక్షిణాఫ్రికా జట్లపై సిరీస్ లు గెలుచుకున్న బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో పైకెగబాకడంతోనే సరిపెట్టుకోకుండా, 2017లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం సంపాదించుకుంది. వన్డే ర్యాంకింగ్స్ లో ఏడవ స్థానంలో నిలిచింది. ఆరో స్ధానంలో ఉన్న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య వ్యత్యాసం కేవలం రెండు పాయింట్లే కావడం విశేషం.