: అది ఐపీఎల్ పై మచ్చ కాదు: శుక్లా


ఐపీఎల్ బెట్టింగ్-ఫిక్సింగ్ కుంభకోణానికి బాధ్యత వహించేందుకు లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా నిరాకరించారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్ పై మచ్చపడినట్టు భావించరాదని తెలిపారు. దీనిపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. ఇక, లోథా కమిటీ నివేదికలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ప్రస్తావనే లేదని ఓ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధం విధించడంతో, ఐపీఎల్ తదుపరి సీజన్ లో ఎన్ని జట్లు ఆడనున్నాయన్న ప్రశ్నకు స్పష్టంగా బదులివ్వలేదు. బీసీసీఐ సమావేశం తర్వాత ఆ విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News