: మోదీవి గొప్పలు...అంగుళం భూమి కూడా పోనివ్వం: రాహుల్ గాంధీ


సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ గొప్పలు చెప్పారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అవినీతి చేయను, అవినీతి చేయనివ్వను' అని సార్వత్రిక ఎన్నికల్లో గొప్పలు చెప్పిన మోదీ... లలిత్ మోదీ, వసుంధర రాజె వ్యవహారంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 'లలిత్ గేట్' వివాదంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విషయంలో మోదీ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంలో ఇరుక్కున్న కేంద్ర మంత్రిపై ఉదారవైఖరి దేనికి సంకేతమని ఆయన ప్రధానిని నిలదీశారు. ప్రధాని చేతలకు, మాటలకు మధ్య సమన్వయం అవసరమని రాహుల్ గాంధీ హితవు పలికారు. భూసేకరణ చట్టాల పేరిట కేంద్రం చేపట్టే చర్యల వల్ల పేదలకు చెందిన అంగుళం భూమిని కూడా అక్రమార్కులకు చెందనివ్వమని ఆయన స్పష్టం చేశారు

  • Loading...

More Telugu News