: గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు పూర్తి
క్యాన్సర్ తో కన్నుమూసిన ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర సాగింది. బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా, రామకృష్ణ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు పేర్కొన్నారు.