: ఘోరకలిని ఆపిన ఫ్రాన్స్ సైన్యం... బెడిసికొట్టిన ఉగ్రవాదుల ప్లాన్!
ఫ్రాన్స్ పై దాడిచేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. కొంత కాలం క్రితం చార్లీ హెబ్డో పత్రికా కార్యాయలంపై దాడి, ఆపై పలుమార్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో వణికిన ఫ్రాన్స్ ఈసారి మాత్రం, వారి పన్నాగాన్ని ముందే పసిగట్టింది. సైన్యంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదుల ప్లాన్ ను తిప్పికొట్టామని, నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని ప్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూ తెలియజేశారు. ఉగ్రవాదులు తలపెట్టిన ఘోరకలి జరగకుండా ఆపగలిగిన సైన్యాన్ని ఆయన అభినందించారు. అరెస్టయిన వారంతా 16 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్కులేనని కాజెన్యూ వివరించారు.