: ఖమ్మంలో ఆకాశం నుంచి రాలిపడిన అరుదైన చేప
ఇటీవల ఆకాశం నుంచి చేపలు రాలిపడడం ఎక్కువైంది. తాజాగా, ఖమ్మంలో ఆకాశం నుంచి ఓ అరుదైన చేప రాలిపడడం చర్చనీయాంశం అయింది. బుధవారం పట్టణంలో వర్షం పడింది. ఆ వర్షంలోనే ఈ చేప కిందపడగా దానిని ఓ చిరు వ్యాపారి దొరకబుచ్చుకున్నాడు. ఆ చేపతో పాటు కప్ప కూడా రాలిపడగా అది కిందపడగానే గెంతుకుంటూ వెళ్లిపోయింది. కాగా, ఆ చేప కాస్త విలక్షణంగా ఉండడంతో దానిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే ఏపీలో కృష్ణాజిల్లాలోనూ చేపలు ఆకాశం నుంచి పడ్డాయి.