: సినిమాల్లోనే బైకులు ట్రై చేస్తా: అల్లు అర్జున్
సినిమాల్లోనే బైకులు నడుపుతానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. హీరో మొటోకార్ప్ కు చెందిన బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజ జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా బైకులు నడుపుతానని అన్నాడు. అయితే ఈ మధ్యనే బైకులపై మోజు పెరిగిందని అల్లు అర్జున్ తెలిపాడు. బైక్ నడిపేటప్పుడు వేగ నియంత్రణతోపాటు, హెల్మెట్ ధరించాలని సూచించాడు. 'ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత' అని అల్లు అర్జున్ హితబోధ చేశాడు. హీరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఆనందంగా ఉందని అన్నాడు.