: బాహుబలి-2ను రూ. 325 కోట్లకు కొన్నారా?
'బాహుబలి' దెబ్బకు ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఇప్పటికే రూ. 220 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. దీంతో, బాహుబలి పార్ట్-2పై భారీ అంచనాలు మొదలయ్యాయి. తొలి పార్టే ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తే, ఇక రెండో పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. బాహుబలి తొలి భాగం చేస్తున్న బిజినెస్ చూసి... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఈ సినిమా రెండో భాగాన్ని రూ. 325 కోట్లకు కొనుగోలు చేసిందని ఆయన ట్వీట్ చేశాడు. ఇదే నిజమైతే బాహుబలి పేరును భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.