: ఈ నెల 22న రాజమండ్రిలో ఏపీ మంత్రివర్గ సమావేశం
ఏపీ మంత్రివర్గం సమావేశం ఈసారి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరగనుంది. ఈ నెల 22 ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలు ముగిసేంతవరకూ సీఎం చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. అంతేగాక చాలా మంది మంత్రులు కూడా అక్కడి పనులను, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని అక్కడే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.