: కేసీఆర్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇతర పార్టీ నేతల ఫిరాయింపులను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీల నేతలకు పెద్దపీట వేస్తూ... సొంత పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారని జోస్యం చెప్పారు. సొంత నియోజకవర్గంలో కూడా గెలిచే సత్తా లేనటువంటి నేతలు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్నామని చెప్పారు.