: పుష్కరాల్లో అన్ని శాఖల పనితీరు అభినందనీయం: చంద్రబాబు


గోదావరి పుష్కరాల నేపథ్యంలో అన్ని శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, పుష్కరాల్లో రవాణా శాఖతో పాటు అన్ని శాఖల పనితీరు అభినందనీయమన్నారు. రాజమండ్రి, కొవ్వూరులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. భక్తులు కూడా క్రమశిక్షణతో పుష్కర స్నానాలు చేయాలని సూచించారు. ఈ తొమ్మిది రోజులు అధికారులకు సహకరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంగా ఉచిత బస్సులు పెంచుతామని చెప్పారు. తన రాకవల్ల భక్తులకు ఇబ్బంది ఏర్పడితే బోటు ప్రయాణం చేస్తామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News