: పుష్కరఘాట్ లో ప్రత్యక్షమైన మొసలి... భక్తుల్లో ఆందోళన
గోదావరి నదిలో ఎంతో భక్తిభావంతో భక్తులు పుష్కరస్నానం ఆచరిస్తున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పుష్కరఘాట్ లో ఏకంగా మొసలి ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి బాలమ్మ రేవు పుష్కర ఘాట్ లో చోటుచేసుకుంది. ఒక్కసారిగా షాక్ కు గురైన భక్తులు పుష్కరఘాట్ లోకి దిగడానికి కూడా సాహసించలేదు. అంతా ఒడ్డునే నిలబడిపోయారు. అనంతరం, సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని మొసలిని పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇంకా ఎన్ని మొసల్లు నీటిలో ఉన్నాయన్న ఆందోళన మాత్రం భక్తుల్లో కనిపిస్తోంది.