: టీఎస్సార్ అవార్డులను కైవసం చేసుకున్న మహేష్, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్
'టీఎస్సార్ టీవీ9' అవార్డులను టి.సుబ్బరామిరెడ్డి కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ద్వారా అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన విజేతలకు అవార్డులను అందజేస్తామని చెప్పారు. అవార్డుల వివరాలు ఇవే... ఉత్తమ నటుడు (2013) - మహేష్ బాబు (సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ హీరో (2013) - రామ్ చరణ్ (నాయక్) ఉత్తమ నటి (2013) - తమన్నా (తడాఖా) ఉత్తమ సహాయనటి (2013) - నదియా (అత్తారింటికి దారేది) ఉత్తమ హీరోయిన్ (2013) - సమంత (అత్తారింటికి దారేది) ఉత్తమ దర్శకుడు (2013) - శ్రీను వైట్ల (బాద్షా) ఉత్తమ చిత్రం (2013) - సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ఉత్తమ వినోదాత్మక చిత్రం (2013) - బాద్షా ఉత్తమ సంగీత దర్శకుడు (2013) - దేవిశ్రీప్రసాద్ (అత్తారింటికి దారేది) ఉత్తమ సహాయ నటుడు (2013) - రావు రమేష్ (సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు) ఉత్తమ నటుడు (2014) - బాలకృష్ణ (లెజెండ్) ఉత్తమ హీరో (2014) - అల్లు అర్జున్ (రేసు గుర్రం) ఉత్తమ నటి (2014) - శ్రియ (మనం) ఉత్తమ హీరోయిన్ (2014) - రకుల్ ప్రీత్ సింగ్ (లౌక్యం) ఉత్తమ దర్శకుడు (2014) - బోయపాటి శ్రీను (లెజెండ్) ఉత్తమ విలన్ (2014) - జగపతిబాబు (లెజెండ్) ఉత్తమ చిత్రం (2014) - దృశ్యం ఉత్తమ సంగీత దర్శకుడు (2014) - థమన్ (రేసు గుర్రం) ఉత్తమ సహాయ నటుడు (2014) - ముఖేష్ రుషి (రేసు గుర్రం) ఉత్తమ సహాయ నటి (2014) - జయసుధ (ఎవడు)