: టీకాంగ్రెస్ లో కలకలం... పార్టీలో ఉంటారా? లేక వెళ్లిపోతారా? అంటూ జానారెడ్డిని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. సీనియర్ నేత, శాసనసభలో విపక్ష నేత అయిన జానారెడ్డికి రాహుల్ నేరుగా ఓ ప్రశ్న వేశారట. కాంగ్రెస్ పార్టీలో మీరు కొనసాగుతారా? లేక వెళ్లిపోతారా? అని జానాను రాహుల్ ప్రశ్నించారన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డిలు కలసిన సందర్భంగా రాహుల్ ఈ ప్రశ్నను సంధించారట. డీఎస్ లాంటి నమ్మకస్తులే వెళ్లిపోయారని... దీంతో, ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థం కావడం లేదని రాహుల్ అన్నారట. దీనికి సమాధానంగా, వదంతులను నమ్మరాదని, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జానారెడ్డి సమాధానం ఇచ్చారట. డీఎస్ వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని సర్ది చెప్పారట.