: ఏపీలో విద్యాసంస్థలన్నిటికీ రెండు రోజుల సెలవులు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలన్నింటికీ రెండు రోజుల సెలవులు ప్రకటించారు. ఈ నెల 20, 21న పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవులు ప్రకటించినట్టు చెప్పారు. మరోవైపు నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణకు గంటా ఆదేశించారు. అంతకుముందు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి గంటా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.