: పుష్కరాలు ముగిసేంత వరకూ నవ్యాంధ్ర రాజధాని రాజమండ్రి: చంద్రబాబు


పుష్కరాలు ముగిసేంత వరకూ నవ్యాంధ్రకు రాజధాని నగరంగా రాజమండ్రి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన పరిపాలన అంతా ఇక్కడి నుంచే సాగుతుందని, మంత్రివర్గ సమావేశాలు సైతం రాజమండ్రిలోనే జరుగుతాయని ఆయన అన్నారు. ఈ ఉదయం కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని పరిశీలించిన చంద్రబాబు, మీడియాతో మాట్లాడుతూ, తనను కలిసేందుకు సింగపూర్ బృందం కూడా రాజమండ్రికే వస్తుందని వివరించారు. అమరావతి ప్లాన్ పై ఆ బృందంతో చర్చించనున్నామని తెలిపారు. పుష్కరాలు ముగిసేంతవరకూ తాను ఎక్కడికీ వెళ్లబోనని అన్నారు. రానున్న రోజుల్లో పుష్కరాలకు రద్దీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నందున, ఏ విధమైన తప్పూ జరగకుండా అధికారులు జాగ్రత్త పడాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News