: పుష్కర ఘాట్ లో తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖకు నివేదిక పంపిన కలెక్టర్
రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ లో ఈ నెల 14న తొక్కిసలాట జరిగి, 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను పంపించారు. ఒక్కసారిగా భక్తులు తోసుకురావడంతోనే ఈ దారుణం జరిగిందని నివేదికలో కలెక్టర్ తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తోసుకురావడంతో వారిని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారని నివేదికలో వెల్లడించారు. ఉదయం 8.30 నిమిషాలకు తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఈ నివేదికను కేంద్ర హోంశాఖకు పంపించారు.