: వృద్ధురాలికి ప్రాణంపోసిన 'ఆవుగుండె'!


తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన ఫ్రంటియర్ లైఫ్ లైన్ ఆసుపత్రి వైద్యులు దేశంలోనే మొదటిసారి వినూత్న శస్త్ర చికిత్స చేసి విజయవంతమయ్యారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81 ఏళ్ల వృద్ధురాలికి ఆవుగుండె నుంచి తీసి తయారుచేసిన వాల్వ్ ను అమర్చి ప్రాణాలు పోశారు. 'వాల్వ్ ఇన్ వాల్వ్ ట్రాన్ స్కాథెటర్ ఎరొటిక్ వాల్వా' (వీఐవీ-టీఎవీఆర్) అనే విధానంలో ఈ ఆపరేషన్ చేసినట్టు ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ చెరియన్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన అల్లూరి సీతాయమ్మ 11 ఏళ్ల కిందట కవాటాల ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఎనిమిది నెలల కిందట ఆమెలో గుండె నొప్పి మొదలైంది. దాంతో దేశంలోని ఆసుపత్రులన్నింటికీ వెళ్లినా ఆమెకు ఎక్కడా సరైన వైద్యం లభించలేదు. చివరగా చెన్నైలో ఆమెకు ఆవుగుండె నుంచి తీసి తయారుచేసిన వాల్వ్ ను అమర్చి ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ముందుకొచ్చారు. దానిపై ఆసుపత్రి వైద్యుడొకరు మాట్లాడుతూ, సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైందని అన్నారు. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ సరికొత్త ఆపరేషన్ చాలా ప్రమాదంతో కూడుకున్నదని చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఆపరేషన్ ను చాలా విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం సీతాయమ్మ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News