: ధర్మపురిలో మధుయాష్కీ పుష్కర స్నానం


కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఈ ఉదయం పుష్కర స్నానం చేశారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు. పుష్కరాలకు మొక్కుబడి ఏర్పాట్లతో మమ అనిపించారని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలను అమావాస్య చంద్రులు పాలిస్తుండడంవల్లే వరుణుడు ముఖం చాటేశాడని విమర్శించారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని యాష్కీ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News