: బోటులో ఏపీ డీజీపీ... రాజమండ్రిలో పుష్కరాలపై నిఘా!
గోదావరి పుష్కరాల్లో తొలిరోజే అపశ్రుతి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీ డీజీపీ జేవీ రాముడు ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగారు. మూడు రోజులుగా ఆయన రాజమండ్రి పరిసరాల్లోనే ఉంటూ పుష్కరాలపై నిఘాను పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడమే కాక పలు పుష్కర ఘాట్లను ఆయన నేరుగా సందర్శిస్తున్నారు. ఇక తాజాగా నేటి ఉదయం ఆయన బోటుపై గోదావరి జలాల్లోకి వెళ్లారు. నదీ తీరంలో జరుగుతున్న పుష్కర స్నానాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు.