: రూ. 220 కోట్లు కొల్లగొట్టిన 'బాహుబలి'... అన్ని రికార్డులూ హాంఫట్!
రివ్యూలు, మౌత్ టాక్ మాటెలా ఉన్నా 'బాహుబలి' చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ, పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ, దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు సినిమాను శిఖర స్థాయికి చేర్చిన రాజమౌళి మ్యాజిక్ మరిన్ని రోజులు కొనసాగుతుందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీ వర్షన్ రూపంలో రూ. 35 కోట్లు రాగా, దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. గత వారాంతంలో రూ. 105 కోట్ల షేర్ సాధించిన బాహుబలి, ధూమ్ (రూ. 100 కోట్లు), హ్యాపీ న్యూ ఇయర్ (రూ. 99 కోట్లు) రికార్డులను తిరగరాసింది. ఇక అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా ఉన్న 'రోబో' (రూ. 290 కోట్లు) దాటేందుకు బాహుబలికి మరింత సమయం పట్టకపోవచ్చని అంచనా.