: నువ్వూ అక్కడే ఉన్నావుగా!... ఏసీబీ ప్రశ్నకు తెలియదన్న ‘వేం’ కుమారుడు!


ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు నిన్న దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కేసులో తమ చేతికి అందిన కాల్ డేటా ఆధారంగా విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కృష్ణకీర్తన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కూడా నిన్న ఉదయం 10 గంటలకే బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో కృష్ణకీర్తన్ పై విచారణను మొదలుపెట్టిన ఏసీబీ, సాయంత్రం 6.45 గంటల దాకా దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ సందర్భంగా ‘‘ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు రేవంత్ రెడ్డి, ఇతరులతో మీ ఇంటిలో మీ నాన్న జరిపిన చర్చల సందర్భంగా నువ్వు కూడా అక్కడే ఉన్నావుగా?’’ అంటూ అతడిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారట. అయితే 8 గంటల పాటు జరిగిన విచారణలో మెజారిటీ ప్రశ్నలకు ‘నాకేమీ తెలియదు’ అనే సమాధానాన్నే కృష్ణకీర్తన్ ఇచ్చారట.

  • Loading...

More Telugu News