: ఒంగోలులో భారీ చోరీ... పుష్కరాలకెళ్లిన వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షల నగలు, నగదు అపహరణ
ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఇంటిలోకి చొరబడ్డ దొంగలు రూ.50 లక్షల విలువ చేసే నగలు, నగదు అపహరించారు. నగరంలోని ఏనుగుచెట్టు సమీపంలోని ఓ ఇంటిలో ఈ చోరీ జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఇంటికి తాళమేసి కుటుంబంతో కలిసి గోదావరి పుష్కరాలకు వెళ్లారు. ఇదే అదనుగా అతడి ఇంటిలోకి చొరబడ్డ దొంగలు రూ.50 లక్షల విలువ చేసే నగలు, నగదును అపహరించుకెళ్లారు. పుష్కరాల నుంచి తిరిగివచ్చిన వ్యాపారి తన ఇంటిలో జరిగిన దోపిడీని గుర్తించారు. వ్యాపారి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.