: భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త


చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చంద్రగిరిలో భార్యపై భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పీలేరు డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పని చేస్తున్న జరీనా బేగంపై భర్త ఖాజా హుస్సేన్ యాసిడ్ చల్లాడు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ దాడి అనంతరం ఖాజా హుస్సేన్ పరారీలో ఉన్నాడు. జరీనా బేగం గతంలో విడాకుల నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు, విడాకులు పొంది ఏడాది కాలం ముగిసినట్టు బాధితురాలు చెప్పింది. విడాకుల అనంతరం ఎలా బతుకుతావో చూస్తానంటూ ఖాజా హుస్సేన్ హెచ్చరించాడని బాధితురాలు తెలిపింది. తనపై కక్షగట్టిన ఖాజా హుస్సేన్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. కాగా, ఖాజా హుస్సేన్ పై ఐదు కేసులు ఉన్నట్టు ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News