: డబ్బులను దొంగిలించగలరు...నైపుణ్యాన్ని దొంగిలించలేరు: మోదీ
యువత కోసం ఏదైనా మహత్తరమైన కార్యక్రమం తీసుకురావాలని ఆలోచించి 'ప్రధాన మంత్రి వికాస్ కౌశల్ యోజన'ను తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో 'కౌశల్ వికాస్ యోజన'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జేబులో డబ్బులైతే ఎవరైనా దొంగిలించగలరు కానీ, నైపుణ్యాన్ని దొంగిలించలేరని అన్నారు. మనలో నైపుణ్యం లేకపోతే మన అవసరం ఎవరికీ ఉండదని ఆయన పేర్కొన్నారు. 'నైపుణ్య భారత్' అంటే కేవలం ఉద్యోగానికి సంబంధించినది మాత్రమే కాదని, ఆత్మాభిమానానికి సంబంధించినదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మిషన్ ద్వారా వచ్చే ఏడాదికి 24 లక్షల మందికి, 2022 నాటికి 40 కోట్ల 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణే లక్ష్యంగా 'కౌశల్ వికాస్ యోజన' పని చేస్తుందని ఆయన తెలిపారు.