: అది నా జీవితంలో మరపురాని క్షణం: క్రికెటర్ మనీష్ పాండే
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకుని, భారత జట్టుకు ఆడడం జీవితంలో మరచిపోలేని క్షణమని వర్ధమాన ఆటగాడు మనీష్ పాండే తెలిపాడు. రోహిత్ శర్మ స్థానంలో జింబాబ్వే టూర్ కు భారత జట్టులో స్థానం సంపాదించిన మనీష్ పాండే, మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి వన్డేలోనే 71 పరుగులతో రాణించిన మనీష్ పాండే జాతీయ జట్టుకు ఆడగల సత్తా ఉందని చాటాడు. జింబాబ్వేతో అరంగేంట్రం ద్వారా జాతీయ జట్టుకు ఆడాలన్న కోరిక తీరిందని, 71 పరుగులు చేయడం ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని మనీష్ పాండే తెలిపాడు. దేశవాళీ సీజన్ లో పరుగులు చేసి, ఐపీఎల్ బెర్తు దక్కించుకున్న మనీష్ పాండే, ఐపీఎల్ లో రాణించడంతో సెలెక్టర్ల కంట్లో పడ్డాడు.