: ఏసీబీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే... సర్వత్రా ఉత్కంఠ


మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇది సర్వత్రా చర్చనీయాంశం అయింది. తాను కేవలం వ్యక్తిగత పనుల మీదే వచ్చానని చింతా చెబుతున్నప్పటికీ... అందర్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ముడుపులు తీసుకున్నారనే ఆధారాలను ఏసీబీ సేకరించిందనే వార్తల నేపథ్యంలో, చింతా రాక రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా, చింతా ప్రభాకర్ కు మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలను సంధించినా సమాధానాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు.

  • Loading...

More Telugu News