: పుష్కరాల డబ్బును తిన్నవారికి పాపం తగులుతుంది: సి.రామచంద్రయ్య


గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం వేల కోట్లు ఖర్చు చేశామని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని... కానీ, ఆ మాటల్లో ఏమాత్రం నిజం లేదనిపిస్తోందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఈ పుష్కరాల డబ్బును మేసి ఉంటే... వారికి తప్పక పాపం తగులుతుందని చెప్పారు. గొప్ప పేరు సంపాదించుకోవాలనే తపనతోనే చంద్రబాబు అన్నీ తానై నిర్వహించారని ఆరోపించారు. పుష్కరాల బాధ్యతను జిల్లా కలెక్టర్ కు అప్పగించి ఉంటే... మరింత సమర్థవంతంగా నిర్వహించి ఉండేవారని అన్నారు.

  • Loading...

More Telugu News