: 'బాహుబలి'కి...చిరంజీవి 150వ సినిమాకి లింకుపెట్టిన రాంగోపాల్ వర్మ


సోషల్ మీడియాలో వ్యాఖ్యల ద్వారా వివాదాలకు తెరతీసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, తాజా ట్వీట్ తో టాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు తెరతీశారు. 'బాహుబలి' సినిమాతో చిరంజీవి 150వ సినిమాని లింకు పెట్టారు. చిరంజీవి తదుపరి సినిమా 'బాహుబలి'ని మించేలా ఉండాలని ఆకాంక్షించారు. అలా అయితేనే చిరంజీవి ఫ్యాన్స్ ఏడేళ్ల నిరీక్షణకు అర్థం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 'బాహుబలి'ని మించకుండా నిర్మించినా, సినిమా విజయవంతం కాకున్నా అది మెగా ఫ్యాన్స్ ను మెగా నిరాశకు గురి చేసేదేనని ఆయన స్పష్టం చేశారు. వర్మ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. చిరు ఫ్యాన్స్ వర్మ వ్యాఖ్యలను అంగీకరిస్తున్నారు. కాగా, చిరంజీవి నటించబోయే 150వ సినిమాను నిర్మించేది ఆయన కుమారుడు కావడం విశేషం.

  • Loading...

More Telugu News