: ఎప్పుడెప్పుడు వాళ్లతో కలిసి నటిస్తానా? అని ఎదురు చూస్తున్నా: కృతి సనన్
ఎప్పుడెప్పుడు షారూఖ్ ఖాన్, కాజోల్ తో కలిసి నటిస్తానా? అని ఎదురు చూస్తున్నానని వర్థమాన నటి కృతి సనన్ తెలిపింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'దిల్ వాలే' సినిమాలో వరుణ్ ధావన్ సరసన కృతి నటిస్తోంది. తొలి షెడ్యూల్ లో వరుణ్ సరసన నటించిన ఆమె, మలి షెడ్యూల్ లో వారితో కలిసి చిత్రీకరణలో పాల్గోనుంది. దీంతో వారితో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. రోహిత్ శెట్టితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని చెప్పిన ఆమె, సీనియర్ నటులైన షారూఖ్, కాజోల్ తో షూట్ లో ఇప్పటి వరకు పాల్గోకపోవడం కాస్త వెలితిగా ఉందని పేర్కొంది. కాగా, 'దిల్ వాలే' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 18న విడుదల కానుంది.