: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం పార్లమెంటులో ప్రశ్నిస్తాం: వైకాపా ఎంపీ మేకపాటి


రానున్న పార్లమెంటు సమావేశాల్లో పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన డీసీపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు ధరలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైతులకు మేలు చేయడమే వైకాపా లక్ష్యమని చెప్పారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News