: భారతీయ వధువుకు కెనడియన్ వరుడి బాలీవుడ్ పాట కానుక
భారతీయ వధువుకు కెనడియన్ వరుడు వివాహ కానుకగా బాలీవుడ్ పాటను ఆలపించాడు. పంజాబీ మూలాలు కలిగిన సిమ్రన్ మల్హోత్రా, కెనడాకు చెందిన ఫ్రాంక్ గెగొరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించడంతో ఈ వివాహం వైభవంగా జరిగింది. కెనడా సంప్రదాయ పధ్ధతిలో జరిగిన ఈ వివాహంలో వధువుపై ఉన్న ప్రేమను వరుడు పాట రూపంలో వ్యక్తం చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఆషికీ-2'లో 'తుమ్ హి హో' పాటను కెనడా యాసతో కలగలిపి పాడాడు. హిందీ స్పష్టంగా రాని ఫ్రాంక్ ఈ పాటను నేర్చుకునేందుకు ఆరు వారాల సమయం పట్టిందని, ఈ పాట పాడడం వెనుక ఫ్రాంక్ కష్టం తనకు తెలుసని వధువు తెలిపింది. పాట పూర్తయిన అనంతరం వధూవరులిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది.