: ఛాంపియన్స్ లీగ్ టీ20 రద్దు
ఛాంపియన్స్ లీగ్ టీ20ని బీసీసీఐ పూర్తిగా రద్దు చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని టోర్నీ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో జరగాల్సిన టోర్నీ కూడా అర్థాంతరంగానే ఆగిపోయినట్టైంది. 2009లో ఛాంపియన్స్ లీగ్ లాంచ్ అయింది. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ సౌత్ ఆఫ్రికాలు ఛాంపియన్స్ లీగ్ కు ప్రాణం పోశాయి. టోర్నీ నిర్వహణ కష్టమైనందునే బీసీసీఐ ఈ టోర్నీని రద్దు చేసింది. ఛాంపియన్స్ లీగ్ స్థానంలో ఐపీఎల్ లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.