: అసెంబ్లీ కమిటీ హాల్ కు మేం ఎలా వెళతాం?: రావుల


పాలమూరు ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ కమిటీ హాల్ లో బుధవారం తనతో బహిరంగ చర్చ జరపాలని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు...టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డికి సవాల్ విసరడం తెలిసిందే. అయితే, రావుల అసెంబ్లీ కమిటీ హాల్ కు వెళ్లలేదు. దాంతో, టీడీపీ నేతలు తోక ముడిచారంటూ జూపల్లి వ్యంగ్యం ప్రదర్శించారు. దీనిపై రావుల మీడియా సమావేశం నిర్వహించారు. జూపల్లి సీరియల్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ కమిటీ హాల్ కు తామెలా వెళతామని ప్రశ్నించారు. జూపల్లితో తాము చర్చకు సిద్ధమేనని, అయితే, తమను సంప్రదించిన తర్వాతే చర్చా వేదికను నిర్ణయించాలని అన్నారు. వందమంది వచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News