: గుర్గావ్ లో గ్యాంగ్ వార్... దుండగుల కాల్పుల్లో పాత నేరస్థుడి మృతి


దేశ రాజధాని సమీపంలోని సంపన్నుల ప్రాంతం గుర్గావ్ లో కొద్దిసేపటి క్రితం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అటుగా వెళుతున్న ఓ కారుపై వెనుక వైపు నుంచి కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముందు వెళుతున్న కారులోని వ్యక్తి చనిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ముందు కారులో పాత నేరస్థుడొకరు వెళుతున్న విషయాన్ని పసిగట్టిన అతడి ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News