: ప్రత్యేక హోదా సాధించుకురండి... లేకుంటే హిజ్రాలతో స్వాగతం తప్పదు: 'సీపీఐ' రామకృష్ణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలంటున్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. సీమాంధ్ర ఎంపీలు తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకురావాలని, లేకపోతే, వారికి హిజ్రాలతో స్వాగతం పలుకుతామని అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉందన్నారు. ఇక, పుష్కరాలపై స్పందిస్తూ... తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. లక్షల మందిని పుష్కరాలకు ఆహ్వానించినప్పుడు వారికి తగిన సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.