: సీఎం చంద్రబాబుపై విశాఖ డీసీపీకి ఫిర్యాదు చేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం


ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్రంలోని పలు ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాటకు చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నాయి. తాజాగా, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం నేతలు విశాఖ డీసీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. సాధారణ ఘాట్ లో చంద్రబాబు పుష్కరస్నానం చేయడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రాకతో వారిని స్నానానికి అనుమతించలేదని, ఆలస్యం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని వారు డీసీపీకి వివరించారు.

  • Loading...

More Telugu News