: మృతులు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావిద్దాం... చంద్రబాబును నిందించడం సరికాదు: కమలానందభారతి


ఏపీలో పుష్కరాల ఆరంభం నాడే దుర్ఘటన చోటు చేసుకోవడం అన్ని వర్గాల వారినీ కలచివేసింది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఘటనకు సీఎం చంద్రబాబే బాధ్యుడని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. భక్తుల కోసం సర్కారు సరైన ఏర్పాట్లు చేయనందునే ఈ ఘోరం జరిగిందని ఆయా పార్టీల నేతలు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత హిందూ దర్మ ప్రచారకులు కమలానందభారతి సీఎం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఘటనకు చంద్రబాబును బాధ్యుడిగా చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ రాజకీయ కోణంలో విమర్శలు చేయరాదని సూచించారు. మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టు భావిద్దాం అని అన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు సంయమనం పాటించాలని అన్నారు.

  • Loading...

More Telugu News