: బీజేపీ ఏపీ, తెలంగాణ అధ్యక్షులు మారనున్నారా?


రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చే యోచనలో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు, తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఏపీలో అధికారపక్షానికి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. అయినప్పటికీ పార్టీ పరంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు. కానీ, ఆయన ఆశించిన మేరకు బీజేపీ ముందుకు సాగడం లేదు. దీంతో, కంభంపాటి స్థానంలో కొత్త అధ్యక్షుడు నియమితులయ్యే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రెండోసారి కొనసాగుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం మరోసారి పొడిగించే అవకాశం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ వీకెండ్ పార్టీగా మారిందని అమిత్ షా భావిస్తున్నారట. ఇలాగే కొనసాగితే తెలంగాణలో పార్టీ వీక్ అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి టర్మ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. దీంతో, ఆయన స్థానంలో కూడా కొత్త నేతను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News