: ‘కోటగుమ్మం’ ఘటనపై మరోమారు జగన్ ఫైర్....చంద్రబాబే కారణమని నిందారోపణ


గోదావరి పుష్కరాల్లో భాగంగా నిన్న రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఫైరయ్యారు. నేటి ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పుష్కర ఘాట్ లో పుష్కర స్నానమాచరించిన జగన్... తన తండ్రి, తాతలకు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు 30 మంది భక్తులు చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు తన పుష్కర స్నానం కోసం వీఐపీ ఘాట్ ను కాకుండా సాధారణ జనం కోసం కేటాయించిన ఘాట్ ను ఎంచుకున్న నేపథ్యంలో కోటగుమ్మం ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చినా తక్కువేనని కూడా జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News