: ఏసీబీ ఆఫీస్ కు కృష్ణకీర్తన్... విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఓటుకు నోటు కేసులో ప్రశ్నించాల్సి ఉందని, నేటి ఉదయం 10.30 గంటలకు తమముందు హాజరుకావాలని అతడికి ఏసీబీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తండ్రి వేం నరేందర్ రెడ్డిలాగే కృష్ణకీర్తన్ కూడా ఏసీబీ నిర్దేశించిన సమయానికే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఈ కేసులో కృష్ణకీర్తన్ ప్రమేయానికి సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ, కృష్ణకీర్తన్ పై విచారణను ప్రారంభించింది.