: కొవ్వూరుకు వైఎస్ జగన్... నేడు పుష్కర స్నానమాచరించనున్న వైసీపీ అధినేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పవిత్ర గోదావరిలో పుష్కర స్నానమాచరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జగన్ పుష్కర స్నానం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మరికాసేపట్లో రాజమండ్రి నుంచి బయలుదేరనున్న జగన్ కొవ్వూరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేస్తారు. పుష్కర స్నానం తర్వాత జగన్ తిరిగి రాజమండ్రి వెళతారని కొత్తపల్లి తెలిపారు.