: కేసీఆర్ పుష్కర స్నానంలో పాము ప్రత్యక్షం!
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పవిత్ర గోదావరి పుష్కరాలను నిన్న సతీసమేతంగా ప్రారంభించారు. పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే సరిగ్గా ఉదయం 6.21 గంటలకే కేసీఆర్ పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. సతీసమేతంగా పుష్కర స్నానం చేసిన కేసీఆర్ ఆ తర్వాత గోదావరి నదికి హారతి ఇచ్చారు. ఇదే సమయంలో అక్కడ నీటిలో సరిగ్గా కేసీఆర్ ముందు ఓ పాము ప్రత్యక్షమైంది. దానిని కేసీఆర్ చూశారో, లేదో తెలియదు కాని... వేగంగా స్పందించిన జాలర్లు బెలూన్ ట్యూబ్ తో దానిని పట్టేసి దూరంగా తీసుకెళ్లారు.