: ఒకే రోజు ఏడు వాహనాలలో శ్రీనివాసుడు


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవం అంటే భక్త కోటికి పండుగే. తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల గురించి అందరికీ తెలిసిందే. భూదేవి, లక్ష్మీ దేవి సమేతంగా మలయప్పస్వామి తిరు వీధులలో ఊరేగుతారు. ప్రతి రోజూ స్వామివార్లు రెండు వాహనాలలో తొమ్మిది రోజులపాటు కనువిందు చేస్తారు. మరి ఒకే రోజు 7 వాహనాలలో స్వామిని దర్శించుకోవాలంటే రథసప్తమి నాడే సాధ్యం.

ఆ రోజు స్వామివారు 7
 వాహనాలలో తిరువీధులలో ఊరేగుతూ భక్త కోటిని అనుగ్రహిస్తారు. దీనిని భక్తులు స్వామి వారికి జరిగే ఒక రోజు బ్రహ్మోత్సవంగా భావిస్తారు. ఈ నెల 17న ఆ పర్వదినం రానుంది. అందుకోసం తిరుమలలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరువీధులను అందంగా అలంకరించారు. రథసప్తమికి విచ్చేసే భక్తుల కోసం వసతులపై అధికారులు దృష్టి సారించారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ ఆలయం కూడా ముస్తాబవుతోంది. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి లక్షకు పైగానే భక్తులు విచ్చేస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News